Header Banner

సాధారణ మహిళలకే కాదు.. కేంద్రమంత్రి కూతురిపై వేధింపులు! నిందితులు ఓ రాజకీయ పార్టీ వారే..!

  Mon Mar 03, 2025 07:00        Politics

సాధారణ మహిళలు, యువతులే కాదు.. ఏకంగా కేంద్రమంత్రి కుటుంబసభ్యులు కూడా ఆకతాయిల వేధింపుల నుంచి తప్పించుకోవడం లేదు. తాజాగా, కేంద్రమంత్రి కూతురును వేధింపులకు గురిచేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలోనే మహారాష్ట్రలో శాంతిభద్రతలపై కేంద్ర యువజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రక్షా ఖడ్సే ఆందోళన వ్యక్తం చేశారు. జల్‌గావ్‌ జిల్లా ముక్తాయ్‌నగర్‌లో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న తన కుమార్తెను, ఆమె స్నేహితులను కొందరు యువకులు వేధించారని కేంద్రమంత్రి తెలిపారు. ఇందుకు సంబంధించి తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఈ కేసుకు సంబంధించి ఏడుగురిపై ముక్తైనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో ఒకరిని షోహమ్ మాలి అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు.


ఇది కూడా చదవండిఏపీ మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు మరో శుభవార్త! ఆది ఏంటో తెలుసా..!


మహాశివరాత్రి సందర్భంగా తమ ప్రాంతంలో ఏటా సంత్‌ ముక్తాయ్‌ యాత్ర నిర్వహిస్తారని కేంద్రంమత్రి తెలిపారు. ఇటీవల నిర్వహించిన యాత్రకు స్నేహితులతో కలిసి వెళ్తానని తన కుమార్తె కోరిందని.. దీంతో సెక్యూరిటీ గార్డుల సాయంతో అక్కడకు పంపించినట్లు చెప్పారు. ఆ సమయంలో కొందరు యువకులు వారిని వెంబడించి వేధించారని తెలిపారు. అంతేగాక, అడ్డుకున్న భద్రతా సిబ్బందిపైనా దురుసుగా ప్రవర్తించారని కేంద్రమంత్రి తెలిపారు. గుజరాత్‌ పర్యటన నుంచి తాను ఇంటికి రాగానే తన కూతురు ఈ విషయం చెప్పిందన్నారు. ఓ ఎంపీ లేదా కేంద్ర మంత్రి కుమార్తెకే ఇలాంటి దుస్థితి ఎదురైతే.. సాధారణ మహిళల పరిస్థితి ఏంటో ఆర్థం చేసుకోవచ్చని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినట్లు కేంద్రమంత్రి రక్షా ఖడ్సే తెలిపారు. ఈ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ స్పందించారు. నిందుతులు ఓ రాజకీయ పార్టీకి చెందినవాళ్లని, అందులో కొందర్ని పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు. వారిపై కచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


తాడేపల్లిలో అరుదైన నాలుగు కాళ్ల జీవి కలకలం! భయంతో పరుగులు తీసిన స్థానికులు!


పసిపిల్లల దందా! 9 నెలల్లో 26 శిశువులను విక్రయించిన మహిళా ముఠా! తల్లి ఒడి నుంచి దూరం చేసి...!


టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం! రఘురామ కేసులో కీలక మలుపు! సీఐడీ మాజీ చీఫ్ పై సస్పెన్షన్ వేటు!


పోసాని కేసులో కొత్త మలుపు! అరెస్టు భయంతో హైకోర్టు మెట్లెక్కిన సజ్జల రామకృష్ణారెడ్డి, కుమారుడు!


శ్రీశైలం ఆలయంలో నకిలీ టికెట్ల గుట్టురట్టు! భక్తులకు మరో హెచ్చరిక!


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ! ఉమెన్ ఎంపవ‌ర్‌మెంట్‌ బ్రాండ్ అంబాసిడర్‌గా ఆ హీరోయిన్..


రఘురామ టార్చర్ కేసులో షాకింగ్ ట్విస్ట్! కీలక ఆధారాలు వెలుగులోకి… డీఐజీకి నోటీసులు!


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapraavsi #unionminister #dughter #harassment #todaynews #flashnews #latestnews